గజ్వేల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారి పక్కనే పాతూరు వద్ద ఉన్న మోడల్ మార్కెట్ రైతు బజార్ ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులను ఆప్యాయంగా పలకరించి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మార్కెట్ లో కొన్ని పనులకు సూచనలు చేసారు. త్వరలోనే పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.