ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ వేసేశాడు. ఏపీలో ఇప్పటికే హైకోర్టు, రాజ్‌భవన్‌ను కట్టేశారట. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో లేని హైకోర్టు, రాజ్‌భవన్‌ను కడితే మంచిదేకదా..? అనుకుంటున్నారా..? అవును కడితే మంచిదే.. కానీ కట్టకుండానే కట్టినట్లు చెబుతూ.. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే..!!
ఇక అసలు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు, రాజ్‌భవన్ నిర్మాణం కోసమని కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల నిధులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ రూ.1500 కోట్లు ఎలా ఖర్చు చేశారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుని చూడగా.. షాక్ తినడం కేంద్ర మంత్రుల వంతైంది. ఏపీలో హైకోర్టు, రాజ్‌భవన్ కట్టకుండానే.. చంద్రబాబు సర్కార్ పంపిన నివేదికన చూసిన కేంద్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశంతో ఏపీ సర్కార్ పంపిన యుటిలైజేషన్ సర్టిఫికేట్‌లో ఆ రెండు భవనాలను కట్టేశామని, అందుకు రూ.1583 కోట్లు ఖర్చు అయిందని ఆ నివేదికలో పేర్కొంది చంద్రబాబు సర్కార్. ఇలా చంద్రబాబు సర్కార్ లేని భవనాలను నిర్మించామని చెబుతూ.. కేంద్రానికి రిపోర్టు పంపడం దారుణమైన విషయమని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.