అవును. అతను అలాగే నాశనమైపోతాడు. ఇప్పటికైనా అతను కళ్లు తెరవాలి. లేకుంటే.. ప్రాపంచిక జ్ఞానం కూడా లేని ఆ వ్యక్తి ఎటూ కాకుండా పోతాడు అంటూ కత్తి మహేష్ మరో సారి విమర్శల వర్షం కురిపించాడు.
అసలు విషయానికొస్తే..
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చుట్టూ ఇప్పుడు భజన పరులు ఎక్కువయ్యారని, అందువల్ల అతన్ని ఎవరూ కాపాడలేరని, ఆ భజన పరులను దాటుకుని బయటకు వస్తే తప్ప పవన్ కల్యాణ్‌కు మంచి భవిష్యత్ ఉండదని అన్నారు. పవన్ కల్యాణ్ తనకు తానే దేవుడినని, అందుకు తన భజన పరులు వంతపాడుతూ భజన చేస్తున్నారన్నారు. ఒక రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యాన్ని నడిపేందుకు ప్రజల మధ్యకు రావాలే తప్ప గాజు మేడల్లో ఉండకూడదన్నారు. గాజుమేడల్లో ఉంటున్న పవన్ కల్యాణ్‌కు ప్రాపంచిక జ్ఞానం కూడా లేదని తీవ్రంగా విమర్శించారు కత్తి మహేష్. ఆ నష్టాన్ని పవన్ కల్యాణ్ గ్రహించాల్సి ఉందన్నారు సినీ క్రిటిక్ కత్తి మహేష్.