టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుర్గగుడి ఆలయం మీద క్షుద్రపూజలు జరిగాయని, ఆ పూజలు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయడానికేనని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, ఒకవేళ క్షుద్రపూజలే జరిగి ఉంటే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందన్నారు.
ఏపీలో వార్ వన్‌సైడ్‌గా ఉందని, ప్రజలంతా చంద్రబాబు పక్షాన నిలబడి 2019 ఎన్నికల్లో 170 స్థానాలు టీడీపీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏమి చేయాలో పాలుపోక ఆవేదనతో.. తన అనుచరులతో ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల గురించి మాట్లాడుతూ.. వైసీపీ నాయకులంతా 420 గాళ్లేనంటూ.. అందులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ పిల్లకాకి అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.