ప్రస్తుత రోజుల్లో ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఇంట బయట ఎక్కడ చూసిన ఏదో ఒక సమయంలో ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి .పోలీసులు ,చట్టాలు బలంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలకు ఫుల్ స్టాప్ పడటంలేదు .తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలో కూకట్ పల్లి లో మంగళవారం రాత్రి అతిదారుణమైన సంఘటన చోటు చేసుకుంది.
ఈ క్రమంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువతిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి దుండగులు పారిపోయారు .కూకట్పల్లి లో మూసాపేట్ హబీబ్ నగర్ లో చోటు చేసుకున్న ఈ సంఘటనలో బోను జానకి అనే యువతి ఇంట్లో నిద్రిస్తుంది.అంతలోనే గదిలో ఏదో శబ్దం అలజడి రేగడంతో లేచి ఎవరు అని అడిగేలోపు దుండగులు కత్తులతో ఆమెను పలుచోట్ల అనేకసార్లు పొడిచారు.
ఒకేసారి ఊహించని సంఘటనలో సదరు యువతి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడ నుండి పారిపోయారు .అయితే ఈ యువతి హత్యకు ఆనంద్ అనే యువకుడితో సంబంధం ఉందని అనుమానంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు.ఆనంద్ జానకిని ప్రేమ అని వేధించేవాడు అని ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు .