వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 59వ రోజు షెడ్యూల్ విడుదల అయింది.
గురువారం ఉదయం గుండుపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.వెదురుకుప్పం, కాపు మొండివెంగన పల్లి, బలిజ మొండివెంగన పల్లి, కమ్మకండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుంపల్లి, నెమ్మలగుంట పల్లి, నూతిగుంట పల్లి, బీరమాకుల కండ్రిగ వరకూ 59వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం సాయంత్రం విడుదల చేశారు.