Home / POLITICS / రేవంత్ అబ‌ద్దాలు నిరూపించు..చ‌ర్చ‌కు మేం రెడీ..ఎంపీ బాల్క

రేవంత్ అబ‌ద్దాలు నిరూపించు..చ‌ర్చ‌కు మేం రెడీ..ఎంపీ బాల్క

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 24గంట‌ల‌విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డంపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తిప్పికొట్టారు. నూతన సంవత్సర కానుకగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను ప్రవేశ పెడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోందని ఆక్షేపించారు. .గాంధీ భవన్ అబద్దాల భవన్ గా మారిందని వ్యాఖ్యానించారు.

కరెంటు కష్టాల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఎంపీ సుమ‌న్ తెలిపారు. తెలంగాణకు, కరెంట్ రెంటి మధ్య బంధం పెనవేసుకుందని తెలిపారు. కరెంటుపై రేవంత్ చెప్పే లెక్కలన్నీ తప్పని నిరూపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు రేవంత్ లాంటి సన్నాసులు ప్రయత్నిస్తున్నారని మండిప‌డ్డారు. తాము కరెంటుపై చెప్పే లెక్కలు అబద్దమైతే ప్రజలు వేసే ఏ శిక్షకైనా సిద్ధమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. `తెలంగాణలో ప్రస్తుత స్థాపిత విద్యుత్ 14 వేల 931 మెగావాట్లు. .తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఛత్తీస్‌ఘ‌ఢ్ ప్రభుత్వంతో, మరో ప్రైవేట్ సంస్థతో మాత్రమే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంస్ధ కాంగ్రెస్ నేత సుబ్బరామి రెడ్డిది. రేవంత్ కు దమ్ముంటే ఒప్పందంలో అవకతవకలు జరిగాయని సుబ్బరామి రెడ్డితో గాంధీ భవన్ నుంచి చెప్పించగలడా?` అని స‌వాల్ విసిరారు.

దొంగలే దొంగ లెక్కలు చెబుతారని రేవంత్ తీరును ఎంపీ సుమ‌న్ ఎద్దేవా చేశారు. `సీఎం కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రం లో అదనపు విద్యుత్ సాధ్యపడింది. భూపాలపల్లి, ఏపీలోని ఆర్టీపీపీ పవర్ ప్లాంట్ ల పనులు ఓకేసారి ప్రారంభమయ్యాయి. భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైంది, ఆర్టీపీపీలో కాలేదు. సీఎం కేసీఆర్ కృషి లేకపోతే ఇది భూపాల‌ప‌ల్లిలో విద్యుత్ ఉత్ప‌త్తి జ‌రిగేదా? 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరితే సీఎం కేసీఆర్‌కు సన్మానం చేస్తామని రేవంత్ అంటున్నడు. 15 వేల మెగావాట్ల ఉత్పత్తిని త్వరలోనే అధిగమించబోతున్నాం. ..సీఎం కెసిఆర్ ను సన్మానం చేసేందుకు దండలతో సిద్ధంగా ఉండు రేవంత్ రెడ్డి` అని ప్ర‌క‌టించారు.

రేవంత్ రెడ్డి అబద్దాల రాయుడు ,కోతల రాయుడు అని మరోమారు రుజువైందని ఎంపీ సుమ‌న్ అన్నారు. `బీహెచ్ఈఎల్‌ నవరత్న కంపెనీల్లో ఒకటి. ఆ సంస్థ‌కు కాంట్రాక్టు ఇస్తే దాని వెనుక కూడా ముడుపులు ఉన్నాయని నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ చెబుతున్న గుజరాత్ కంపెనీ ఎక్కడుందో ఆయనకే తెలియాలి. తెలంగాణ వచ్చాక విద్యుత్ వినియోగం భారీ గా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. విద్యుత్ రంగం పై బహిరంగ చర్చకు రా రేవంత్. .పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానాతో కలిసి చర్చ కు వచ్చినా అభ్యంతరం లేదు. సమయం, స్థలం రేవంత్ నిర్ణయించినా అభ్యంతరం లేదు. మా వైపు నుంచి నాతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ,భానుప్రసాద్ చర్చకు వస్తాం. మేం చెప్పేవి అబద్దాలు అయితే నేను ముక్కు నేలకు రాస్తా. రేవంత్ చెప్పేది అబద్దమైతే అబిడ్స్ చౌరాస్తా లో ముక్కు నేలకు రాయాలి` అని స‌వాల్ విసిరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat