Home / POLITICS / అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మారిపోయిన గాంధీభ‌వ‌న్..!

అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మారిపోయిన గాంధీభ‌వ‌న్..!

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై దేశ‌వ్యాప్తంగా ప్రశంసలు ద‌క్కుతుంటే… కాంగ్రెస్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, భానుప్ర‌సాద్ అన్నారు. అవాకులు చెవాకుల‌తో గాంధీ భ‌వ‌న్‌ను అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మార్చార‌ని ఎద్దేవా చేశారు. విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని వారు సూటిగా ప్ర‌శ్నించారు.

`విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలంగాణ వచ్చాక రెండే కుదిరాయి. యూనిట్ కు ఐదు రూపాయలలోపే చెల్లించే విధంగా ఆ ఒప్పందాలు ఉన్నాయి. ఒక్క సోలార్ రంగంలోనే మూడువేల మెగావాట్లకు పైగా ఉత్పత్తి చేశాం. అది కాంగ్రెస్ నేత‌ల‌కు కనిపించడం లేదా? సాగునీటి ప్రాజెక్టులపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలే విద్యుత్ ప్రాజెక్టులపై కేసులు వేసి ఆటంకం కల్పిస్తున్నారు` అని మండిప‌డ్డారు. 24 గంటల విద్యుత్ షాక్ నుంచి కాంగ్రెస్ నేతలు తేరుకోలేకపోతున్నారని విమ‌ర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి అయితే కాంగ్రెస్ నిండా మునగడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు.

విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారులు కాని వారిని గతంలో కూడా నియమించారని..వాస్త‌వాలు తెలియ‌ని వారే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్ప‌ష్టం చేశారు. నార్ల తాతారావు, వైవీ రెడ్డి, పార్థ‌సారధి కూడా గతంలో విద్యుత్ బోర్డులకు పని చేశారని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు అబద్దాలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. కేంద్ర జలసంఘం అధికారుల బృందం కాళేశ్వర ప్రాజెక్టును సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి కితాబిచ్చిందని…అందరూ తెలంగాణ ను పొగడుతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కళ్ల లో నిప్పులు వేసుకుని విమర్శిస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు పై రైతులకు స్పష్టమైన అవగాహన ఉందని…ఎవరి హాయంలో కరెంటు పరిస్థితి బాగుందో వారు గ్రామగ్రామాన చర్చించుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ రంగంలో తెలంగాణ పురోగతి పై అనేక అవార్డులు రివార్డులు వచ్చాయని అయిన‌ప్ప‌టికీ…అవాకులు చెవాకులు మాట్లాడుతూ అబద్దాల భవన్ గా గాంధీ భవన్ ను మార్చేశారని ఎద్దేవా చేశారు. హుందాగా నిజాలు మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు ప్రజల్లో గౌరవం కొంతయినా పెరుగుతుందని వారు సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat