14 ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ఈ సంవత్సరం ( 2018 ) అత్యంత ముఖ్యమైనదని రాష్ట్ర ఐటీ , పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి కల్వకుట్ల తారకరామారావు అన్నారు.మంగళవారం మంత్రి కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో పురపాలక కార్యదర్శి అరవింద్ కుమార్‌తోపాటు మాజీ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, డీఎంఏ శ్రీదేవితో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రారంబించిన ప్రతిష్ఠాత్మక, పురపాలక ప్రాజెక్ట్లు లు , కార్యక్రమాలను ఈ సంవత్సరం డిసెంబర్ లోపే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణను ప్రతీ విభాగం ఏర్పాటు చేసుకోవాలన్నారు.రాష్ట్రంలో కొత్త పురపాలక సంఘాల ఏర్పాటు ప్రస్తుత సంఘాల విస్తరణ ను ఈ ఏడాది లోగా పూర్తి చేయాలన్నారు.హైదరాబాద్ నగరంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. నగర శివారు ప్రజల దాహార్తిని తీర్చడానికి జలమండలి చేపడుతున్న పలు పథకాలను ఈ ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.