రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జవహార్ వవన్ లో ప్రారంభమైన పిఐఓ ( భారత సంతతి పౌరులు) సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ఎన్ఆర్ఐ సంక్షేమ శాఖ మంత్రులు హాజరుకాగా, తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన వంద మంది సభ్యలతో కూడిన సమావేశం జరగనుంది.
ఆయా దేశౄల్లో భారత సంతతి పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చజరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ కీలక సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ప్రధానంగా గల్ఫ్ బాధితుల సమస్యలపై మంత్రి చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో మంత్రి కేటీఆర్ భేటి కానున్నారు.