టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరి ముందుకు వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీసు ల దగ్గర కలెక్షన్స్ సునామీ మొదలు అని అందరు అంటుంటారు .టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పవన్ మూవీ వస్తుందంటే ఇక ప్రేక్షకుల అంచనాలకు అడ్డే ఉండదు .అంతగా వీరిద్దరి కాంబినేషన్పై భారీగానే ఉంటాయి. అయితే అందరి అంచనాలకు తగ్గట్లు విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రం పై ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. సీరియస్ గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని మషేష్ అన్నారు. సినిమాను అపహాస్యం చేసిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్యంత దారుణమైన సినిమా ఇది అంటూ ఆయన విమర్శించారు. ‘రిస్క్ చేసి చూస్తే… టైమేమో…’ (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్ లో ఉంది) అంటూ కామెంట్ చేశారు.
సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా.
రిస్క్ చేసి చూస్తే…టైమెమో… మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో).— Kathi Mahesh (@kathimahesh) January 10, 2018