వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిన్నటితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతోంది. అందులోను చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుండటంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అయితే, జగన్ తన పాదయాత్ర ఆద్యంతం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య శ్రీ పథకం గురించి ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పథకం పేరుతోపాటు.. ఆ పథకం నామరూపాలు లేకుండా చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది. మరో పక్క ఏపీ చికిత్స చేసుకుంటేనే ఆ పథకం వర్తింప చేస్తామంటూ ప్రజలను బెదిరింపులకు గురి చేస్తోంది. అయితే, పెద్ద జబ్బు చేసిన వారు ఆరోగ్య శ్రీ వైద్యం అందక పడే కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. పోనీ ఆరోగ్య శ్రీ కార్డు కింద వైద్యం చేయించుకుందామంటే.. ఏపీలో పెద్ద పెద్ద ఆస్పత్రులు లేకపోయే. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే సదుపాయం. అలాగే, అంత డబ్బు లేక పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ విషయంపై ఓ ప్రముఖ పత్రిక తన కాలం పేజీలో ఓ వార్తను ప్రచురించింది. జగన్ తన పాదయాత్రలో చెబుతున్న ఆరోగ్య శ్రీ విషయాలు వాస్తవమేనని. ఏపీలో ఆరోగ్య శ్రీ పథకం కుంటుడిందని, పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ సేవలు అందడం లేదంటూ ఓ సంచలన వార్తను ప్రచురించింది.