సంక్రాంతి పండగకు అందరు ఇష్టంగా చేసుకునే వంటలు ఎన్ని ఉన్నా..అత్యంత ప్రీతికరమైన వంటకం మాత్రం నువ్వుల అరిసెలు..ఎక్కువ ఇంట్రో లేకుండా..డైరెక్ట్ గా అవి ఎలా చేయలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
- బియ్యం – ఒక కేజీ
- బెల్లం – అర కేజీ
- నువ్వులు – 50 గ్రాములు
- నూనె – వేయించడానికి కావాల్సినంత
ఎలా తయారు చేయాలి :
ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యన్ని పిండి పట్టించాలి.ఎటువంటి నూకలు లేకుండా మెత్తగా ఉండటానికి పిండిని జల్లించి పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం సరిపడా నీళ్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి. అందులో బియ్యం పిండిని వేసి బాగా కలిపి దించేయాలి.
తరువాత స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిలో నువ్వులు చేర్చి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని గుండ్రగా సన్నగా వత్తుకోవాలి.ఇలా వత్తుకున్న వాటిని నూనెలో వేసి రెండువైపులా కాలి ఎరుపు రంగు వచ్చాక తీసి పేపర్ మీద పెట్టుకోవాలి.కొద్దిగా ఆరిపోయాగా గాలి తగలకూండా భద్రపరుచుకోవాలి.