తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ మరో మూడు రోజుల్లో రానుంది.తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.భోగి రోజు సాయంత్రం సంది గొబ్బెమ్మలను పిల్లల చేత పెట్టించిన తరువాత ఈ కార్యక్రమం చేస్తారు.దీ ని కోసం బంతి పుల రెక్కలు,రేగు పండ్లు ,చిల్లర నాణేలు ,చెరుకు గడ ముక్కలను కలిపి వుంచుకోవాలి .భోగి పండ్లను పలానా వయస్సు పిల్లలకు మాత్రమే పోయాలనే నియమం ఏమీ లేదు.కాకపోతే 12 ఏళ్ల లోపే వయస్సు వున్న పిల్లలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు.అయితే మొదటిసారి భోగి పండ్లను పోసేటప్పుడు మాత్రం పిల్లల వయస్సు బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకుంటారు.భోగి పండ్లను పోసే ముందు పిల్లలను తూర్పు ముఖంగా కుర్చోబెట్టాలి .వారికి తల్లి తన చేతుల మీ దుగా కుంకుమ బొట్టు పెట్టి..భోగి పండ్లను పోసి ఈ కార్యక్రమాన్ని ప్రారంబించాలి.
భోగి పండ్లను పోయడాన్ని పిల్లలకు దిష్టి తీయడంగా భావిస్తారు.కాబట్టి ముందుగా వారికి భోగి పండ్లను పోసేవారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ..తన చుట్టూ ముమ్మారు సంవ్యంగాను ,ముమ్మారులు అపసవ్యంగాను తిప్పి పోస్తుంటారు .తల్లి చేతులమీదుగా ఇలా భోగి పండ్లను పోసిన తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు కూడా పిల్లవాడి తలపైన పడేటట్లుగా భోగి పండ్లను పోస్తారు.భోగి పండ్లను అర్కఫాలం అని కుడా అంటారు.అర్కుడు అంటే సూర్య భగవానుడే భోగి వన్నాడు నుంచి సూర్య భగవానుడు ఉత్తరాయణం వైపు మల్లిపోతాడు కాబట్టి అయన ఆశీర్వాదం లభించాలనే సూచనగా భోగి పండ్లను పోస్తుంటారు.అందుకోసం భోగి పండ్లును పోసే సమయంలో ఆదిత్య హృదయాన్ని మననం చేసుకునే సాంప్రదాయం కుడా మంచిదే.సూర్యుని ఆశీస్సులు అందుకునేందుకు జరిగే కార్యక్రమం కాబట్టి సూర్యాస్తమయం లోపుగానే ఈ కార్యక్రమం జరగాలని చెప్పుతుంటారు.
భోగి పండ్లను దిష్టి కి చిహ్నంగా భావిస్తారు కాబట్టి వాటిని తినడం నిశిబ్ధం .భోగి పండ్ల కార్యక్రమం పూర్తయిపోయి పిల్లవాడికి మంగలిహరతి పడిన తరువాత నెల మీద పడిన పండ్లను పెద్దలే ఎరేయ్యాలి.ఇలా ఏరిన పండ్లను బీదలకు దానం చెయ్యడమో,ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడెయ్యాలి .