తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ.. ఎందుకంటే భోగి ,సంక్రాతి,కనుమ వరుసగా మూడు రోజులు మూడు ప్రాధాన్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని పిలుస్తారు.ఇది అందరికి పెద్ద పండుగే..పిల్లల నుండి పెద్దలు,రైతుల వరకు అందరికి పెద్ద పండుగే.ఈ పెద్ద పండుగ ఆరంభం రోజైన భోగి నాడు మనం భోగి మంటలు వేసుకోవడం ద్వారా మనం పండుగ వేడుకలను ప్రారంబిస్తాం. భోగి మంటలనేవీ చిన్నలకు,పెద్దలకు అందరికి కుడా ఒక వేడుకైనటువంటి క్రియ . అయితే ఈ భోగి మంటలు ఎందుకు వేసుకుంటారంటే ఇందుకు మూడు రకాల కారణాలు వున్నాయి . అవి ఏమిటంటే భోగి పండుగ తెలుగు వారు జరుపుకునే ఒక ముక్యమైన పండుగ .ఈ పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 వతేదీల్లో వస్తుంది.ధక్షనయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దురమవుతూ ఉంటాడు.అంటే దక్షణ అర్ధ గోళంలో భూమికి సూర్యుడు దురమవుతూ వుండటం వల్ల భూమి పై చలి భాగా పెరుగుతుంది.ఈ చలి వాతవరనాన్ని తట్టుకోవడం కోసం ప్రజలు సెగ కోసం భగ భగ చలిమంటలు వేసుకునే వారు పూర్వకాలంలో ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం వల్ల ఈ చలిని తట్టుకునేందుకు ఈ మంటలను అందరూ వేయడం వలన ఈ రోజుకు భోగి అనే పేరువచ్చింది అని
చెప్పేసి ఒక కారణం వాడుకలో వుంది.
భోగి గురించి చెప్పుకునే మరో పరమార్ధకత ఏమిటంటే సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రత్యేకతమైన ప్రాధాన్యత వుంటుంది.దీనికి బోగ పర్వం అనే పేరు.భోగం అనే పేరుకు అర్ధం ఏంటంటే అనుభవం అని ఆనందంగా దేనిని అనుభవిస్తాము లేదా దేనిని అనుభవించడం వలన మనకు ఆనందం కలుగుతుందో దానిని భోగం అనాలి .అలాంటి భోగము అనుభావిన్చావాల్సిన రోజును బోగి అంటారు .నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం అన్న మాట .ఒక్కక్కరికి ఒక్కొక్క దాంట్లో ఆనందం వుంటుంది.సామాన్యులకు లవ్ కిక విషయాలు దొరికితే అదే భోగం .ఒక విషయంపై విసుగు కలిగి మరో విషయంపై ఆనందం కలగజేస్తే ఆ ఆనందం కలగాజేసేదే భోగి..సామాన్యులకు లవ్ కిక విషయాలపట్ల భోగం కలిగితే యోగులకు అ లవ్ కిక విషయాలపట్ల భోగం కలుగుతుంది.ఇలాగే గోదాదేవి అంటే అండామ్మ వారు భోగి రోజునే దివ్య భోగాలు పొందింది అని చెప్పుతారు .ఎలాగంటే తాను చేసినటువంటి రకరకాల ప్రార్ధనలు ఫలితంగా భోగి నాడే అండాలమ్మ వారు శ్రీరంగనాదున్ని స్వంతం చేసుకుంది కాబట్టి రంగనాధుని సాంగత్య రూపంలో గోదాదేవికి భోగం లభించిన కారణంగా ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటారు.అంటే చలి పెరిగిన కాలంలో వెచ్చధనమే ఒక భోగం కాబట్టి భోగి నాడు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకోవడం ద్వారా సంక్రాంతి పండగల పరంపరని
ప్రారంబిస్తామన్నమాట .
భోగి మంటలకు చెప్పే మరో నిర్వచనం ఏమిటంటే భగ అనే పధం నుంచే భోగి అన్న మాట పుట్టిందని చెప్పుతారు.భగ అంటే మంట లేదా వేడిని పుట్టించడం అని అర్ధం .ధక్షనయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, భాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ..రాబోయే ఉత్తరాయణం లో సుఖ సంతోషాలను ఇమ్మని వేసేవే భోగి మంటలు . అందుకే తమ ఇంటిలో వున్నా పాత సామాన్లను భోగి మంటలో వేసేసి అంటే వాటిని తమ కష్టాలు గా భావించుకుంటూ… వాటిని భోగి మంటల్లో వేసి తరవాతి కాలంలో వాటి స్థానంలో కొత్త వస్తువులు మా ఇంటికి రావాలి,కొత్త దానం రావాలి,కొత్త సుఖాలు రావాలి అని కోరుకోవడంలోనే భోగి మంటల పరమార్ధం దాగి వుందని మరొక నిర్వచనం.ఏది ఏమైతేనేంటి భోగి అనేది ఒక పండగా ..భోగి అనేటు వంటిది మన జీవితాల్లో భాగాన్ని నిపే పండుగ .భోగి మంటల్లోనుంచి వచ్చే కాంతులు మనకు రాబోయే రోజుల్లో లబించబోయే సుఖ సంతోషాలకి చిహ్నాలుగా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.