బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మెప్పిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాతగా డబుల్ రోల్ పోషిస్తూ అందరిచేత వహ్వా అనిపించుకుంటుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ .తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పరి .ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను అనుష్క శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది .టీజర్ లో అనుష్కా బాధగా చూస్తూ అందర్నీ భయపెట్టే విధంగా ఉంది .ఇలాంటి పాత్రలో నటించడం ఆమెకు ఇదే తొలిసారి .మీరు ఒక లుక్ వేయండి ..
