మువీ: అజ్ణాతవాసి
నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యేల్, రావు రమేష్ తదితరులు
సంగీతం: అనిరుద్
సినిమాటోగ్రఫీ: మణికందన్
నిర్మాత: ఎస్ రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మువీ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అందులోనూ సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి పరాజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఖచ్చితంగా ఊరట దక్కుతుందని భావించారు. దానికి తగ్గట్టుగానే టీజర్ మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక సినిమాల నుంచి పొలిటికల్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో వచ్చిన అజ్ణాతవాసి చాలా హంగామా చేస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కి తగ్గట్టుగా సినిమా ఉందా…ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
గోవింద్ భార్గవ్ సాధారణ స్థాయి నుంచి ఎదిగిన ఓ కార్పోరేట్ యజమాని. ఆయనతో పాటు కొడుకుని కూడా హత్య చేసి ఏబీ గ్రూప్ కి సీఈవో కావాలనుకుంటాడు సీతారామ్ (ఆది పినిశెట్టి). కానీ గోవింద్ భార్గవ్ కి అభిషిక్త భార్గవ్ (పవన్ కళ్యాణ్) అనే కొడుకు ఉన్నాడని, ప్రత్యర్థులకు భయపడి ఎవరికీ తెలియకుండా అభిని పెంచుతున్నారన్న విషయం వారికి తెలియదు. కానీ తండ్రి, తమ్ముడు మరణంతో సవతితల్లి ఇంద్రాణి(ఖుష్బూ) పిలవడంతో అస్సాం నుంచి వచ్చిన అభి తన తండ్రి వారసత్వంగా ఏబీ కంపెనీకి సీఈవో ఎలా కాగలిగాడన్నదే సినిమా మెయిన్ లైన్. ప్రత్యర్థులను మట్టికరిపించే కార్పోరేట్ సంస్థల వ్యవహారాలను, అభి కుటుంబ పరిణామాలను, మధ్యలో వర్మ( రావు రమేష్), శర్మ తో పాటు వారి కూతుర్లుగా చెప్పుకున్న కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యేల్ ప్రేమ వ్యవహారాలు చివరకు ఎలా ముగిసాయన్నది తెరమీద చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు
నటీనటులు:-
పవన్ కళ్యాణ్ కి బాగా అలవాటయిన పాత్రగానే చెప్పుకోవాలి. త్రివిక్రమ్ కూడా పవన్ ని కేంద్రంగా చేసుకుని కథ అల్లినట్టు కనిపిస్తోంది. చాలావరకూ పవన్ నటన సంత్రుప్తి కలిగించేలా ఉంది. కానీ కొన్ని సీన్లు సాగదీయడంతో పవన్ ఓవరాక్షన్ లా మారిపోయింది.
ఇక హీరోయిన్లు కీర్తి సురేష్, అనూ పాత్రలు చాలా నామమాత్రం. పెద్దగా ఆసక్తి కలిగించే అంశాలు లేవు. ఇక రావు రమేష్ తన పాత్ర కొంత మేరకు మెప్పించారు. అక్కడక్కడా పేలిన పంచ్ డైలాగులు కూడా వర్మ పాత్రవే కావడం విశేషం. ఇక ఆది పినిశెట్టి తొలిసారి ప్రధాన విలన్ పాత్రలో కనిపించాడు. కొంతవరకూ మెప్పించాడు.
ఇక మిగిలిన వారిలో తనికెళ్ళ భరణి, శ్రీనివాసరెడ్డి సహా అందరూ సహాయ పాత్రల్లో తమ పరిధి మేరకు కనిపించారు.
టెక్నికల్ టీమ్:-
ఈ సినిమాకి అంతా బలమని భావించిన త్రివిక్రమ్ పెద్ద బలహీనతగా కనిపించారు. సహజంగా లాజిక్కులతో మ్యాజిక్కు చేసే త్రివిక్రమ్ కి ఈ సినిమాలో జిమ్మిక్కు చేయలేని స్థితి కనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో కథ ఎంపికలోనూ, కథనంలోనూ కొత్తదనం చూపించలేకపోయారు. చివరకు డైలాగ్స్ కూడా నామమాత్రంగా కనిపించాయి. ఆ తర్వాత సంగీతం పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. కొడకా..కోటీశ్వరరావా పాట తప్ప సినిమాలో అలరించే అవకాశమే కనిపించలేదు. ఇక సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపించింది. ఫైట్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
టెక్నికల్ టీమ్:-
ఈ సినిమాకి అంతా బలమని భావించిన త్రివిక్రమ్ పెద్ద బలహీనతగా కనిపించారు. సహజంగా లాజిక్కులతో మ్యాజిక్కు చేసే త్రివిక్రమ్ కి ఈ సినిమాలో జిమ్మిక్కు చేయలేని స్థితి కనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో కథ ఎంపికలోనూ, కథనంలోనూ కొత్తదనం చూపించలేకపోయారు. చివరకు డైలాగ్స్ కూడా నామమాత్రంగా కనిపించాయి. ఆ తర్వాత సంగీతం పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. కొడకా..కోటీశ్వరరావా పాట తప్ప సినిమాలో అలరించే అవకాశమే కనిపించలేదు. ఇక సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపించింది. ఫైట్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
విశ్లేషణ:-
మొత్తంగా ఈ సినిమా ద్వారా పవన్ తన అభిమానులను కూడా మెప్పించే అవకాశం లేకుండా పోయింది. రాజకీయాలలోకి వచ్చే ముందు తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఎంపికలోనే లోపం జరిగింది. సినిమా ఆద్యంతం పాత సినిమాలను తలపిస్తుంది. ముఖ్యంగా అత్తారింటికి దారేది ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా కథనంలో త్రివిక్రమ్ పేలవమైన ప్రదర్శన పవన్ ఫ్యాన్స్ ఆశలు నీరుగార్చేసింది. మొత్తంగా సినిమా ఎవరినీ మెప్పించగలిగే అవకాశం లేదు.
పంచ్ లైన్:అజ్ణానం లో అజ్ణాతవాసి
update ap రేటింగ్: 2/5