టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.అయితే అమెరికాలో ఒక రోజు ముందే విడుదలైన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద బాహుబలి ,ఖైదీనెంబర్ 150 రికార్డులను బ్రేక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి .
ప్రీమియర్ షో ల ద్వారా దాదాపు 1.40 మిలియన్ల డాలర్లను వసూలు చేసినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు .అజ్ఞాతవాసి మూవీకి సంబంధించిన విదేశీ పంపిణీ హక్కులను ఎల్ఏ తెలుగు సంస్థ రూ.19.50 కోట్లకు కొనుగోలు చేసింది .అయితే డిస్టిబ్యూటర్లు మంగళవారం అక్కడ ప్రీమియర్ షో ల కోసం ఆరు వందల స్క్రీన్లను బుక్ చేసినట్లు సమాచారం .
బాహుబలి ది బిగినింగ్ ,ఖైదీ నెంబర్ 150 మూవీస్ ప్రీమియర్ షోల ద్వారా వరసగా 1,005,630 డాలర్లు ,1,295,613 డాలర్లను వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు .అయితే మొత్తం 1,464,647 డాలర్ల వసూలుతో ఆ రెండు సినిమాల రికార్డ్లను బద్దలు కొట్టింది అజ్ఞాతవాసి .