టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌కు,హీరోయిన్ పూనమ్ కౌర్‌కి మధ్య రహస్య సంబంధం ఉందని.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. చెప్పి కత్తి మహేశ్ సంచలనానికి తెరలేపారు. అలా కామెంట్స్ చేయడమే కాకుండా… అనంతరం పలు టీవీ చానళ్లు తిరిగుతూ మొత్తాన్ని ఉక్కిరి బిక్కిర చేస్తున్న సంగతి తెలిసిందే.
పవన్-పూనంలకు దగ్గరి సంబంధాలున్నాయని.. అందుకే వారు తిరుమలలో ఒకే గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారని.. వారి మొత్తం బండారం బయటపెట్టే షాకింగ్ వీడియోలు తన వద్ద ఉన్నాయని కత్తి మహేశ్ బాంబు పేల్చాడు.ఒకవేళ పవన్‌కి దమ్ముంటే.. తనపై కేసు వేసుకోవాలని.. నా దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టడానికి ఏమాత్రం భయపడను అంటూ కత్తి మహేశ్ సంచలనం సృష్టించారు.
అయితే తెలుగు చానల్స్ అన్నీ తిరిగిన కత్తి మహేశ్ కు తెలుగులోనే నంబర్ న్యూస్ చానల్‌గా కొనసాగుతున్న ఓ చానల్ భారీ ఆఫర్ ఇచ్చిందట. పవన్-పూనమ్ వీడియోలు కనుక మాకు ఇస్తే మీరు అడిగినంత మొత్తాన్ని ఇస్తామని భారీ ఆఫర్ ఇచ్చిందట. లక్షలు ఖర్చయినా సరే.. ఆ వీడియోలు తమకి ఇవ్వాలని కత్తిని అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. కత్తి మహేశ్ గనుక ఆ వీడియోలను ఇస్తే పవన్-పూనమ్‌లు చిక్కుల్లో పడ్డట్టే అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.