వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిన్నటితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతోంది. అందులోను చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుండటంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో జగన్‌కు ఉన్న ఫాలోయింగ్ చూసిన టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. అయితే, వైఎస్ జగన్ కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, నిన్న జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ప్రారంభం కావాలని, కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ సమన్వయ కర్త చంద్రమౌళిని ప్రజలు గులిపిస్తే.. తనను కేబినెట్‌లో కూర్చోబెట్టి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని తానే దగ్గరుండి స్వయంగా చూసుకుంటానన్నారు. అంతేగాక తన పాదయాత్ర పూర్తి కాగానే.. మల్లీ బస్సు యాత్ర కూడా చేస్తానని కుప్పం ప్రజలకు చెప్పారు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.
ఇదిలా ఉండగా.. మరో పక్క కుప్పంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదారణపై, టీడీపీ నాయకుల తీరుపై చంద్రబాబు వర్గం ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంకు అందజేస్తున్నారు. ప్రజాదారణను చూసిన ప్రజలు జగన్‌చెంతకు చేరే అవకాశం ఉండటంతో ఇదంతా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.