ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో మహేష్ కత్తి-పవన్ కళ్యాణ్ ఎపిసోడే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. పవన్ పై కత్తి విమర్శలు చేయడం పీకే ఫ్యాన్స్ బూతులు తిట్టడం.. ఇలా చిన్నగా మొదలైన రగడ.. రచ్చః, రచ్చస్య,రచ్చోభ్యః అన్నట్టు తయారైంది. ఇక ఈ రచ్చలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి ఆ వివాదాన్ని మరో మలుపు తిప్పింది.
అప్పటి వరకు పీకే రాజకీయాలు, సినిమాల మీదే వ్యాఖ్యలు చేసిన కత్తి.. పర్సనల్ లైఫ్ పై కూడా విమర్శలు చేయడంతో ఒక్కసారిగా అన్ని వర్గాలు ఉలిక్కి పడ్డాయి. కత్తి పై పూనమ్ చేసిన ఇన్ డైరెక్ట్ వ్యాఖ్యలకి కత్తి సంధించిన ఆరు ప్రశ్నలు అయితే ఓ రేంజ్లో సెన్షేషన్ అయ్యాయి. అంతటితతో ఆగని కత్తి తాజాగా ఒక ప్రేస్ మీట్లో.. పవన్‌కి సంబంధించిన ఓ సీక్రెట్ ఉందని.. అవకాశం ఉన్నప్పుడు అది బయట పెడుతానని.. అన్నాడు.
నిజానికి కత్తి మహేష్ దగ్గర పవన్‌కి సంబంధించిన ఓ పెద్ద సీక్రెట్ ఉందని.. అది ఉంది కాబట్టే.. కత్తి మహేష్ ఇంత కాన్ఫిడేంట్ గా మాట్లాడుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైన పవన్‌కి సంబంధించిన సీక్రెట్ బయటపడితే.. పవన్‌కి డ్యామేజ్ ఏ రేంజ్లో జరుగుతుందో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.