ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్‌లో పుష్కరకాలం నుండి అధినేత చంద్రబాబునే కీర్తించిన తమ్ముళ్లు.. ఇప్పుడు చినబాబు లోకేష్‌బాబును వీరుడుసూర్యుడు అంటూ ఎత్తేస్తున్నారు. అయితే లోకేష్‌కు మంత్రి ఇవ్వడానికి ఆయనకున్న అర్హతలేంటని చాలా మంది ప్రశ్నిస్తూ వస్తున్నారు. అడ్డదారిలో లోకేష్‌ను ఏకంగా సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే అనేక విమర్శలు వస్తుండగా.. ఈ విమర్శలను మంత్రి పత్తిపాటి పుల్లారావు కొట్టిపారేస్తూ చెప్పిన చేసిన వ్యాఖ్యలు వింటే.. నిజంగానే ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇలాంటి అర్హతలు కావాలా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే.
టీడీపీ మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. లోకేష్‌కు ముఖ్యమంత్రి అయ్యేందుకు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయని.. లోకేష్ సీఎం అయ్యేందుకు కావాల్సిన మూడు ప్రధాన అర్హతలంటూ వాటిని వివరించారు. అందులో ఒకటి నారా లోకేష్ చంద్రబాబుకు కుమారుడు కావడమని పుల్లారావు వివరించారు. ఇక రెండో అర్హత ఎన్టీఆర్‌కు మనవడు కావడం అన్నారు. మూడో అర్హతగా బాలకృష్ణకు అల్లుడు కావడం అని పుల్లారావు వివరించారు. లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ మూడు అర్హతలు చాలని పుల్లారావు చెప్పారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పుల్లారావు… సీఎం అయ్యేందుకు లోకేష్‌కు ఉన్నస్థాయిలో అర్హతలు మరెవరికీ లేవన్నారు. లోకేష్ సీఎం అయ్యేందుకు వ్యక్తిగతంగా ఆయనలోని అర్హతలను మంత్రి వివరిస్తారేమో అనుకున్న మీడియా ప్రతినిధులకు నిరుత్సాహమే ఎదురైంది. పుల్లారావు చెబుతున్న అర్హతలను చూస్తే… తాత మాజీ సీఎం, తండ్రి సీఎం, మామ యాక్టర్ అయితే చాలు.. ఎవరైనా ముఖ్యమంత్రికి అర్హత సాధించినట్టేనా అని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.