సినీ నటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు రాజకీయ పరంగాను.. ఇటు వ్యక్తిగత జీవితం పరంగాను కష్టాల్లో పడ్డారా..? చెప్పుకోలేని నిజాలను దాచిపెడుతున్నారా..? ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే పవన్ కల్యాణ్.. తనను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే, పై ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం రావడానికి కారణాలు లేకపోలేదు. కారణాలను పరిశీలిస్తే.. పవన్ తన జనసేన పార్టీని.. ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు స్థాపించినట్లు అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవమే. అలాగని, పవన్ కల్యాన్ అన్ని విషయాలపై స్పందించిన దాఖలాలు లేవు. మరో పక్క మంత్రులను సైతం ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్.. సమస్యల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపేలా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జనసేన పేరుతో సభలు పెట్టి ఊగిపోవడం తప్ప ఏం చేశారు అంటూ ప్రశ్నించిన కత్తి మహేష్‌పై పవన్ అభిమానులు కత్తి కట్టారు. అంతేగాక కత్తి మహేష్ ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడి చేస్తామని సోషల్ మీడియా వేదికగా వీడియోలు కూడా పోస్ట్ చేశారు.
తమ అభిమానులు ఇటువంటి పనులకు పూనుకోకూడదని చెప్పడంలో పవన్ కల్యాణ్ చెప్పకపోడంతో మరికొన్ని ప్రశ్నలు తలెత్తాయి. దీంతో రాజకీయ నేతగా ఉన్న జవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తే చంపేస్తారా..? అంటూ కత్తి మహేష్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్ .. పవన్ కల్యాణ్.. పూనం కౌర్‌కు మధ్య గట్టి సంబంధమే ఉందంటూ తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కత్తి మహేష్ ఆరు ప్రశ్నలను సంధించిన విషయం విధితమే. ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకున్న పవన్ కల్యాణ్ లిస్టులో వదినల జాబితా చాలానే ఉందంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.