తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు గ్రేటర్ అధికారులు సిద్దమయ్యారు.హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ రోడ్లను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో బంజారాహిల్స్‌లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అలాగే జూబ్లీహిల్స్‌లో దాదాపు ఆరు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం నుంచి జూలై 9 వరకు జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు సహకరించాలని అధికారులు కోరారు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్12 లో మరియు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో 4లేన్ కారిడార్ ను నిర్మించబోతున్నట్లు రోడ్డు రోడ్డు భవనాల శాఖ స్పష్టం చేసింది.
