Home / TELANGANA / తెలంగాణ చ‌ట్ట‌స‌భ‌లు..దేశానికే ఆద‌ర్శం..విప్ గొంగిడి సునీత‌

తెలంగాణ చ‌ట్ట‌స‌భ‌లు..దేశానికే ఆద‌ర్శం..విప్ గొంగిడి సునీత‌

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో ప్రారంభమైన రెండు రోజుల  18 వ అఖిల భారత విప్ ల సదస్సు తెలంగాణ శాసన సభ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ‘చట్టసభలు సమర్థవంతంగా పనిచెసేందుకు అనుసరించాల్సిన విధానం ‘అనే అంశం మీద ఆమె ప్రసంగించారు

పద్నాలుగేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం మహోద్యమం నడిపిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని గొంగిడి సునీత తెలిపారు. తన పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అదే స్ఫూర్తి తో బంగారు తెలంగాణ సాధనకు నడుం బిగించార‌ని అన్నారు.

తెలంగాణ చట్టసభలు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా నడవాలని సభా నాయకుడిగా కేసీఆర్ చిత్తశుద్ధి తో ప్రయత్నిస్తున్నారని విప్ సునీత తెలిపారు. అసెంబ్లీ, మండలిల్లో చర్చలు సమర్థవంతంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. .ప్రజల ఆశలు వమ్ముకాని రీతిలో తెలంగాణ సభలు నడుస్తున్నాయన్నారు. సభలను సమర్ధవంతంగా నడిపించడం విప్ లకు పెద్ద సవాలేన‌ని అన్నారు. .పార్టీలకు అతీతంగా అందరినీ చర్చల్లో భాగస్వామ్యం చేసేందుకు విప్ లు నిరంతరం సంప్రదింపులు జరపాలని అన్నారు. సభా సమయం దుర్వినియోగం కాకుండా విప్‌లు ఎప్పటికపుడు సభ్యులను సమన్వయం చేసే పద్దతిలో సాగాలన్నారు.

తెలంగాణ చట్టసభలు సమర్ధంగా నడవడానికి అన్నీ పార్టీలు సహకరిస్తున్నాయని విప్ సునీత తెలిపారు. `నేను మొదటి సారి శాసన సభకి ఎన్నికయ్యాను. సీనియర్ల సలహాలు తీసుకుంటూ విప్ భాద్యతను సమర్ధంగా పోషించడానికి ప్రయత్నిస్తున్నాను. దేశంలో మిగతా సభలు కూడా అర్ధవంతంగా జరిగితేనే ప్రజలకు చట్ట సభల పై గౌరవం మరింత పెరుగుతుంది.` అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat