కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రం జై సింహా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే, సోమవారం ఈ చిత్ర యూనిట్ జై సింహా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్ బ్రహ్మానందం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ… బాలకృష్ణ నిద్ర లేచినప్పట్నుంచి.. పడుకునే వరకు నాన్నగారి నామస్మరణ లేకుండా.. నాన్నగారు ఏం చెప్పారంటే. నాన్నగారు ఎలా యాక్టింగ్ చేశారంటే.. అంటూ నాన్నగారి నామస్మరణ చేస్తారన్నారు. ఇప్పటికే తనకు సంస్కృతంలో ఉన్న పదాలకు సంబంధించిన అర్థాలను తనను అడిగి తెలుసుకుంటాడని అన్నారు బ్రహ్మానందం.
బాలకృష్ణ గురించి ఇంకో మాట మాట్లాడుతూ.. బాలకృష్ణ తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోతుంది. అరే.. ట్రైన్ ఎందుకు వెనక్కి వెళ్లిపోతుందని ఎవరూ అడగరు.. మాకు అనవసరం.. అక్కడ ఉన్నది బాలయ్య.. బాలయ్య తొడ గొట్టాడు కాబట్టి.. ట్రైన్ వెనక్కి వెళ్లింది అంటూ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతారన్నారు. అటువంటి మాస్ సినిమాలు చేయాలంటే బాలయ్యనే చేయాలని, నూటికి నూరుపాళ్లు బాలయ్య ఫర్ఫామెన్స్‌ను దర్శకుడు కేఎస్ రవికుమార్ తన జై సింహా చిత్రంలో చూపించారని చెప్పారు బాలకృష్ణ.