తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో జర్నలిస్ట్ వంగూరి ఈశ్వర్ భర్త నాగేశ్వరరావు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ సమస్యను ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిగణించి స్వయంగా ఇటీవలే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చూడాలని కోరారు.
ఈ మేరకు మంత్రి కేటీఆర్ చొరవతోముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా సర్జరీ నిమిత్తం రూ 3లక్షల విలువైన చెక్కును మంజూరు చేశారు. మంగళవారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ఈశ్వరికి అందజేశారు.. తమ కుటుంబానికి అండగా ఉండాలని ఈశ్వరి కోరగా ప్రతిస్పందించిన మంత్రి మీ కుటుంబనికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.
ఎప్పుడు ఎమ్మెల్యే అజయ్ నీకు అందుబాటులో ఉంటారని, మీ ఇంటికి వచ్చి మీ క్షేమ సమాచారాన్న తెలుసుకుని నాకు చెబుతాడాని అన్నారు. “ఖమ్మం వెళ్ళాక ఈశ్వరి ఇంటికి వెళ్లి రా అజయ్” అని ఎమ్మెల్యే కి చెప్పారు. మీరు నిశ్చింతగా ఆపరేషన్ చేయించుకొని ధైర్యంగా ఉండండి నా తరుపున అజయ్ ఉంటాడు.. మీకు ధైర్యం చెపుతాదు.. అని వ్యాఖ్యానించారు.. తమ కుటుంబానికి అండగా నిలబడి భర్త వైద్యానికి ఆర్ధిక సహకారం అందించిన మంత్రి కేటీఆర్ గారికి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఈశ్వరీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.