పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ పాట వివాదాల్లో చిక్కుకుంది. తమ మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని న్యాయవాది కోటేశ్వరరావు ఆరోపించారు. దీనికి సంబంధించి మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. సినిమాలో ‘కొడకా కోటేశ్వరరావు’ పాటను తొలగించాలని, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రచయిత, నిర్మాతపై చర్యలకు డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ గొంతు సవరించుకొని పాడిన ఈ పాట వివాదాల్లో చిక్కుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విడుదలకు సిద్ధంగా ఉన్న అజ్ఞాతవాసికి ఈ వివాదం ఏ మలుపు తిప్పుతుందోనని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
