పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా రేపు ( జనవరి10న) విడుదల కానున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఈసినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను వేయరాదని తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. అర్థరాత్రి తర్వాత వేసే ఈ షోల వల్ల అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్మాతలకు చెప్పారు.గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రోజుకు ఏడు షోలను వారం రోజుల పాటు వేసుకోవచ్చని ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ప్రత్యేక అనుమతులిచ్చింది.
