ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర పంచాయితీ ,ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడుకు పెను ప్రమాదం తప్పింది .మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది .
రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మేర్లపాక గ్రామానికి దగ్గర మంత్రి కాన్వాయ్ లో రెండు వాహనాలు డీకోన్నాయి .దీంతో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి .అయితే ఈ ప్రమాదంలో మంత్రి లోకేష్ కు పెను ప్రమాదం తప్పింది అని అధికారులు చెబుతున్నారు .ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి లోకేష్ ను వేరే వాహనాల్లో తిరుపతికి తరలించారు .అనుకోకుండా జరిగిన ప్రమాదం కావడంతో టీడీపీ నేతలు ,కార్యకర్తలు తెగ ఆందోళన చెందుతున్నారు .