సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ ఆదివారం మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్యనగర పరిధిలోగల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది.
ఇదే క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఫాతిమా కళాశాల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ఒక ట్విట్ చేశారని, ఆ ట్వీట్‌కు స్పందించిన చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు ఓకే చెప్పారని కత్తి మహేష్ ఎద్దేవ చేశారు. మొత్తానికి ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యలు ఇంత కాలానికి పరిష్కారానికి నోచుకున్నాయన్న మాట అంటూ వ్యాంగ్రాస్ర్తాలు సంధించారు కత్తి మహేష్. వ్యూహాలు రచించడంలో ఇద్దరూ తోడు దొంగలేనంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు.