గ్రేటర్ వరంగల్ 44 డివిజన్ ఉప ఎన్నిక ప్రచారం నిన్న సాయంత్రం వరకు ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో బీజేపీ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మరియు అభ్యర్థి సంతోష్ రెడ్డి పోలిస్ లకు చిక్కారు.వారివద్ద ఒక జీప్ మరియు ఎర్టిగా కార్ (TS03ER6636 ) సుమారు ౩లక్షలు వరకు దొరికాయి . అయితే పోలీసులు రాకను గమనించిన బీజేపీ నాయకులూ అప్రమత్తంఐ డబ్బులను దాచినట్టు సమాచారం.