సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ ఆదివారం మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్యనగర పరిధిలోగల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది.
ఇకపోతే.. ఎప్పుడూ పవన్ వర్సెస్ కత్తి మహేష్ లా సాగే ఈ షో ఒక్కసారిగా పూనమ్ కౌర్ ఎంటర్ కావడంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. అందులో భాగంగానే కత్తి మహేష్ తన మీడియా సమావేశంలో అటు పవన్ కల్యాణ్‌పై విమర్శల వర్షం.. ఇటు పూనమ్ కౌర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్‌పై కత్తి మహేష్ విమర్శలు అలా ఉంచితే.. పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ సంధించిన ఆరు ప్రశ్నలిలా ఉన్నాయి..
1 .పూనమ్ కౌర్‌కు బ్రాడ్ అంబాసిడర్ పేరు ఎవరి ద్వారా వచ్చింది?
2. తిరుమలలో పవన్‌తో పాటు నిలబడీ ఒకే గోత్రంతో పూజ చేసింది నిజం కాదా..?
3. పవన్ మోసం చేశాడనే బాధతో ఆత్మహత్యయత్నం చేసుకుంది నిజం కాదా? అప్పుడు మీరు ఉన్న ఆస్పత్రి ఏంటి? ఆ బిల్లులు కట్టింది ఎవరు?
4.మీ అమ్మను కలిసిన పవన్ ఏం హామీ ఇచ్చారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా లేదా?
5.డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం…?
6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగంతో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? అక్కడ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ మీరేం చేశారో చెప్పండి.
ఇక అసలు విషయానికొస్తే.. కత్తి మహేష్ పూనమ్ కౌర్‌కు సంధించిన ఆరో ప్రశ్నకు సమాధానం దొరికేసిందంటూ.. సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ఆ ప్రశ్న క్షుత్రపూజలకు సంబంధించింది కాగా.. సమాధానం ఇలా ఉంది..
క్షుద్ర మాంత్రికుడు నర్సింగంతో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? అన్న ప్రశ్నకు..
జల్సా సినిమా టైమ్‌లో ద్వారకా తిరుమలలో అయ్యస్ట్ జగన్నాథపురం అనే ఊరిలో లక్ష్మీ నరసింహాస్వామి టెంపుల్‌లో ఈ ఘటన జరిగింది. 24 గంటలూ ఆ దేవాలయంలో పూజలు జరుగుతుండటం విశేషం. అంతేగాక పెద్ద పెద్ద ప్రముఖులు ఆ దేవాలయ దర్శనానికి క్యూ కడుతుంటారు. అయితే, కత్తి మహేష్ చెప్పిన నర్సింహులు అన్న పేరుగల వ్యక్తే అక్కడ ప్రధాన పూజారి కూడాను. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన చిత్రం షూటింగ్ సమయంలో పగలు లక్ష్మీ నరసింహాస్వామి టెంపుల్‌లో పూజలు చేయించుకునేందుకు నిర్ణయించిన క్రమంలో పగలు వెళితే.. స్టార్‌డమ్‌తో ప్రజలు ఎగబడే అవకాశం ఉన్నందున.. భక్తులకు, దేవాలయ సిబ్బందికి అటంకం కలగకుండా..అందులోను ఎలాగో ఆ దేవాలయంలో 24 గంటలు పూజలు జరుగుతున్నందున… ఆ దేవాలయ పూజారి నర్సింహులు రాత్రి సమయంలో పవన్ కళ్యాణ్ పేరిట పూజలు చేశారట. ఇదండీ అసలు విషయం.. కత్తి పూనమ్ కౌర్‌కు వేసిన ఆరో ప్రశ్నకు సమాధానం దొరికేసిందన్నమాట..
మరి.. పవన్ కళ్యాన్ చేసింది పూజలో.. లేక క్షుత్రపూజలో అన్న విషయాలను కత్తి మహేష్ తన నిజ నిర్ధారణలో బయటపెట్టాల్సి ఉంది.