అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ ,పూనమ్ కౌర్ మధ్య వార్ హాట్ టాపిక్ .అందులో భాగంగా పవన్ కత్తిల మధ్య నెలకొన్న వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్ధం కాక ఇటు పవన్ ఫ్యాన్స్ అటు కత్తి మద్దతుదారులు తలలు పట్టుకుంటున్నారు.అయితే తాజాగా ఆదివారం హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన కత్తి మహేష్ పెద్ద దుమారాన్నే లేపాడు.దీనిపై పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందించారు .
అందులో భాగంగా కొంతమంది స్వార్ధ రాజకీయ కారణాలకు, రహస్య ఎజెండాలకు తాను లక్ష్యంగా మారానని తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంలో పవన్ కల్యాణ్ కల్పించుకుని తన గౌరవాన్ని కాపాడాలని వేడుకుంటూ వరుస ట్వీట్లు పెట్టింది. ‘గౌరవనీయులైన పవన్ కల్యాణ్ గారు.. ఇది నా కెరీర్, ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నాకు సహాయం చేయండి’ అని పూనమ్ మరో ట్వీట్ చేశారు. ఆపై “రహస్య అజెండాలతో వస్తున్న వారికి లక్ష్యంగా నేను మారాలని అనుకోవడం లేదు. నేను మిమ్మల్ని కలిసి ఈ విషయంలో మాట్లాడుతాను” అని పవన్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేసింది.