సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ ఆదివారం మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్యనగర పరిధిలోగల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది.
మీడియా సమావేశంలో మీ రక్షణ బాధ్యతపై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా..? అన్న ఓ విలేకరి ప్రశ్నకు కత్తి మహేష్ సమాధానమిస్తూ.. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముతున్నాను. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుందని నమ్ముతున్నాను. అందులో భాగంగానే నా సెక్యూరిటీ ఈ స్టేట్ చూసుకుంటుందని నేను నమ్ముతున్నానంటూ కత్తి మహేష్ సమాధానమిచ్చాడు.
నేనూ మీడియాలో భాగమే.. నాకూ .. లా.. తెలుసు. నేను పొలిటికల్‌గా అన్ని విషయాల గురించి మాట్లాడుతాను. నేను స్పందించని ఇష్ట్యూ అంటూ లేదు. సినిమా హీరో ఒక రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నప్పుడు.. ఒక సినిమా విమర్శకుడు.. రాజకీయ విమర్శకుడు కాకూడదా ..? అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కత్తి మహేష్.