తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత మూడున్నర సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు .ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి లో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇవాళ ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ప్రతాప్‌రెడ్డి 2004లోటీఆర్ఎస్ పార్టీ తరఫున చేర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు. 2009లో ఓడిపోయారు. తర్వాత బీజేపీ లో చేరారు.