తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ బిల్లును రూపొందించడానికి ఏడుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం ఏర్పాటైంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షుడిగా ఉన్న మంత్రి వర్గ ఉపసంఘంలో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్ , ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, హరీశ్ రావు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పోచారం, కేటీఆర్ గతంలో పంచాయతీరాజ్ శాఖను నిర్వహించగా.. ఇంద్రకరణ రెడ్డి గతంలో జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.