గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆస్పత్రి కోసం 5 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు.
Rs. 5 lakhs for treatment of popular cube artist Gundu Hanmanth Rao released from CM relief fund. pic.twitter.com/n7aGw2zfjO
— KTR (@KTRTRS) January 8, 2018
కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గుండు హనుమంతరావు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. అంత ఆర్థిక స్థోమత లేకపోవటంతో.. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది. చిరంజీవి నుంచి రూ.2లక్షలు అందజేశారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5లక్షల సాయం చేసింది ప్రభుత్వం.