డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రముఖ యాంకర్ మాచి రాజు ప్రదీప్ ఎట్టకేలకు పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు.డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి దొరికిన తర్వాత.. జనవరి 5వ తేదీలోపు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు . మరింత సమయం కోరిన ప్రదీప్.. జనవరి 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. ఈ యాంకర్ తోపాటు చాలా మంది ఉన్నారు. ప్రదీప్ మాత్రం మొదటి వరసలో కూర్చున్నాడు. కుటుంబసభ్యులు కూడా రావాలనే నిబంధన ఉండటంతో.. అతని వెంట తండ్రి వచ్చాడు.
