వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి మారెప్ప విమర్శల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వా మ్యమనేది, ఆత్మగౌరవమనేది, రాజ్యాంగ బద్దమైన పాలనను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీరామార్ అని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే చెందుతుందన్నారు.
ఇక జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ.. జగన్ ది.. ఓ నీచమైన చరిత్ర అని ధ్వజమెత్తారు.. ఆయన దగ్గర ఉన్నదంతా 90 శాతం మంది గజదొంగలేన్నారు. అంతా క్రిమినల్స్ అన్నారు. చంద్రబాబు అనుభవంతలేదు… ఆయనెలా ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రశ్నించారు. నంద్యాల ఎన్నికల సందర్భంగా చంద్రబాబును కాల్చండి… రోడ్డుమీదకు ఈడ్చండి… చెప్పులతో కొట్టండి.. ఎంతో సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన మన హిందూ దేశంలో ఇలాంటి మాటలా మాట్లాడేది అంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి మారెప్ప. అంతేగాక బుట్టా రేణుక తనకు మళ్లీ ఎంపీ సీటు కావాలని అడిగితే.. అందుకు జగన్‌మోహన్‌రెడ్డి రూ.50 కోట్లు డిమాండ్ చేశాడని, అందుకే ఆమె వైసీపీని వీడి టీడీపీలోకి చేరిందంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి మారెప్ప.