ఈ మధ్య కాలంలో అటు బహిరంగంగానే కాకుండా.. ఇటు సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైరం నడుస్తుందంటూ వార్తలు వెల్లువెత్తుతున్న మాట తెలిసిందే. అంతేగాక, ఇటీవల అల్లు అర్జున్ పలు ఫంక్షన్లకు హాజరై మాట్లాడుతుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి చెప్పమంటే.. చెప్పను బ్రదర్ అంటూ .. పవర్ స్టార్ అభిమానులకు యాంటీ అయ్యాడు స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఈ నేపత్యంలో.. అల్లు అర్జున్ తల్లి నిర్మల ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాపై ప్రశంల వర్షం కురిపించింందట. తన కొడుకు హీరో కాకుంటే.. ఒక సోల్జర్‌ను చేసి ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇక మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. చిరంజీవి శివుడు అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నంది అని పేర్కొంది. మెగాస్టార్ చిరంజీవి పైనా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పైనా బన్నీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తే.. బన్నీపై పడే మొదటి దెబ్బ తనదేనంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిర్మల.