ఏపీలో అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి జ్వాలలు అప్పుడే మొదలయ్యాయి .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వారిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .అందులో కొంతమందికి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవిలిచ్చాడు .ఇక్కడే బాబు కొంపను కొల్లేరు చేసుకున్నాడు అని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి .అందులో భాగంగా కాకినాడ ఎంపీ తోట నరసింహం గత కొంతకాలంగా అధికార టీడీపీ పార్టీ కార్యక్రమాలకు ,అధికారక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు .
ఈ నేపథ్యంలోనే తోట నరసింహం గురించి ఏర్పాటు చేస్తున్న పలు కటౌట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ఫోటోలు లేకుండా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.అయితే త్వరలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇటివల వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతిలో ఎంపీకి పలు మార్లు అవమానం జరగడమే కాకుండా సొంతనియోజకవర్గంలో ఆయన పెత్తనం చెలాయించడం నచ్చని ఎంపీ నరసింహం వైసీపీలోకి చేరడానికి సిద్ధమయ్యారు .అందుకే తన అనుచరవర్గంతో ,కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ కూడా జరిపారు అని జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎక్కువ పారిశ్రామిక వేత్తలకు అవకాశమిచ్చిన చంద్రబాబు గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలకు తెరతీయడంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఈసారి కూడా పారిశ్రామిక వేత్తలకు అవకాశమివ్వాలని బాబు యోచిస్తున్నారు అని తెల్సి ఎంపీ నరసింహం ఈ నిర్ణయం తీసుకున్నారు అని టీడీపీ నేతలు అంటున్నారు .జగన్ పాదయాత్రలో భాగంగా ఇటువైపు వచ్చిన సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కొంతమంది ఎమ్మెల్యేలతో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారు అని వార్తలు తెగ హాల్ చల్ చేస్తున్నాయి ..చూడాలి మరి నరసింహం ఏ నిర్ణయం తీసుకుంటారో ..?