డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రముఖ యాంకర్ మాచి రాజు ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అం దించేందుకు యత్నించి అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్ శుక్రవారం వీడియో ద్వారా తాను సోమవారం బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు.ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్ సమాచారం అందించారు.నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
