తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వైద్య,విద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెల్సిందే .అయితే గతంలో అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వం తరుపున స్కూల్ అఫ్ నర్సింగ్ మరియు కాలేజ్ అఫ్ నర్సింగ్ తనిఖీ వెళుతున్న అధికారుల కన్నులు కప్పి అత్యంత దారుణంగా చట్టాన్ని ఉలంగిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు తమ చేతివాటం చూపిస్తున్నారు.అందులో భాగంగా మామలు రోజులలో సంబంధిత కళాశాలలో బోధన చెప్పే సిబ్బంది ఆచూకీ కూడా కనపడరు… రాష్ట్రంలో ని కొన్ని కళాశాలలో ప్రిన్సిపాల్ కూడా లేరు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు…
మరీ ఇలాంటి పరిస్థితిలో నర్సింగ్ చదివే అభ్యర్థులకు నాణ్యమైన విద్యా ఎలా అందగలదు… ప్రభుత్వం ఇచ్చే రెయింబర్సుమెంట్ కోసం కొన్ని నర్సింగ్ కళాశాలలు ఎంత దారుణానికి ఒడికడుతున్నాయో… జగమెరిగిన సత్యం..తనిఖీ చేయడానికి ప్రభుత్వ అధికారులు వస్తున్నారు అని తెలిసి ఆరోజుకు మాత్రమే ఏదో ఒక హాస్పిటల్స్లో పని చేసే వారిని తీసుకొచ్చి ఒక్క రోజు మాత్రమే ఫ్యాకల్టీ ఉన్నట్టు చూపిస్తున్నారు..ఒక్క రోజు వచ్చిన అభ్యర్థికి ఇచ్చే మామూలు ఎంత అనేది తెలుస్తే మోఖానా వేలు వేసుకోవాల్సిందే… ఒక్క అభ్యర్థియే నాలుగు నుండి ఐదు చోట్ల చలామణి అవుతున్నారు.
కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని పరిగణనలోనికి తీసుకొని నర్సింగ్ విద్యా సంస్థలలో చదువుకొనే విద్యార్థులకు మరియు బోధన సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానం పాటించాలి అని కాళోజి నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఉత్తర్వులు జారిచేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో నిబద్ధత ఉందో అర్ధమవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నర్సింగ్ అఫిసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను రాథోడ్,ప్రధాన కార్యదర్శి సుస్మితమరియు సభ్యులు విద్యార్థి విభాగం అధ్యక్షుడు,భరత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేష్,NOA కన్వీనర్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించారు .ఈ సందర్భంగా లక్ష్మణ్ రుదావత్ మాట్లాడుతూ దీనివలన చాలా వరకు నర్సింగ్ విద్యాసంస్థలలో విద్యార్థుల హాజరు కూడా పెరుగుతుంది.బోధన సిబ్బంది కూడా సమయపాలన పాటించే అవకాశం ఉంటుంది మరియు నర్సింగ్ విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశాలు ఉంటుంది అని అన్నారు..