తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కాపీ కొట్టేశాడని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపీ కొట్టే కామెంట్ చేస్తే పరవాలేదు కానీ..అది నాన్ సింక్ స్థాయిలో ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ కాపీ దేని గురించి అంటే..ఎన్నికల హామీల గురించి!..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినప్పటికీ…ఇంటింటికీ తాగు నీరిందిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ అలా ఇవ్వకపోతే ఓట్లు అడగబోనని సంచలన ప్రకటన చేశారు. తన హామీని నిలుపుకొనేందుకు గులాబీ దళపతి వేగంగా ముందుకు సాగుతున్నారు. కాగా, ఏపీ మంత్రి నారా లోకేష్ అచ్చూ ఇదే హామీ ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ నిర్ధేశిత పనులన్నింటినీ పూర్తి చేసిన తర్వాతే తాము ఓట్లు అడుగుతామని ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని కాలపరిమితిలోగా నూరు శాతం అమలు చేసి తీరుతామని మంత్రి లోకేష్ అన్నారు. కాగా, లోకేష్ సవాల్ బాగానే ఉన్నప్పటికీ…ఇప్పటికే ఎన్నో హామీలు పెండింగ్‌లో ఉన్నాయని..దాదాపు 4 ఏళ్లల్లో నిలుపుకోని హామీలను..ఏడాదిలో ఎలా చేస్తారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.