ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చంద్రబాబు తర్వాత తమ భవిష్యత్తు ముఖ్యమంత్రి అని తెలుగు తమ్ముళ్ళు చాలా సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి ఇటు టీడీపీ వర్గాల్లో అటు ఏపీ రాజకీయ వర్గాల్లో పలు సార్లు చర్చలు కూడా జరిగాయి .
తాజాగా నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం తెలుగు తమ్ముళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారు అని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అంటున్నారు .శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 26వ తేదిన విజయవాడ దుర్గ గుడిలో ,డిసెంబర్ 18వ తేదిన శ్రీకాళహస్తిలో మద్యం సమర్పించి జంతువులను బలిచ్చి తాంత్రిక పూజలు జరిగాయి అని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు .
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ తనయుడు లోకేష్ ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా క్షుద్ర పూజలు నిర్వహించారు అని ఆయన ఆరోపించారు .అయిన ముఖ్యమంత్రి కావాలంటే చేయాల్సింది క్షుద్ర పూజలు కాదు ప్రజలకు మేలు .గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం గుప్పించిన హామీలను నెరవేర్చడం అని ఆయన వ్యాఖ్యానించారు ..