కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే సంగతి తెలిసిందే. అయితే ఈ పదానికి మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణలో ప్రధాన నగరమైన కరీంనగర్‌లో చేపట్టే అభివృద్ధికి ఈ పేరును పథకానికి కేసీఆర్ (కరీంనగర్ సిటీ రినోవేషన్) అని పేరుపెట్టారు. రూ.250 కోట్లతో చేపట్టబోయే పనులు రేపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మౌళిక సదుపాయలు మెరుగుపర్చడంతో భాగంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాల్లో విస్తరించేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో భాగంగా కరీంనగర్‌లో నిర్మించ తలపెట్టిన ఐటీ సెంటర్‌కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మంలో ఐటీ హబ్ భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇదే వరుసలో నిజామాబాద్, మహబూబ్‌నగర్ పట్టణాలు కూడా అతి తర్వలోనే చేరనున్నాయి.