అవును, మీరు చదివింది నిజమే. తమ్ముడిని చూసేందుకు వెళ్లిన ముగ్గురు అక్కల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని సహరసాలో చోటు చేసుకుంది. కాగా, సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సహరసా డీబీ రోడ్డు రైల్వే ట్రాక్ పక్కన నివాసం ఉంటున్న సంతోష్, జాయ్‌స్వాలాకు తొమ్మిది సంవత్సరాల కొడుకు చిరాజ్ ఉన్నాడు. చిరాజ్‌కు నిధి, కోమల్, మరో సోదరి ఉన్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. వారి తమ్ముడు కొద్ది రోజులు కనిపించకుండా పోయాడు. అయితే, రైల్వే ట్రాక్ పక్కన ఓ బాలుడు చనిపోయి ఉన్నాడన్న పోలీసుల సమాచారం మేరకు వెళ్తున్న ఆ ముగ్గురు సోదరీమణులు.. ఆ మృతదేహాన్ని చూసేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్‌పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలి ఆ ముగ్గురు సోదరీమణులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఈ వైర్లను తొలగించాలని సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని, అయినా అధికారులు పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యమే ఇప్పుడు ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిందని వారు ఆగ్రహించారు. తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న స్థానికులు పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. ఏదేమైనా ఓ పక్క తమ్ముడి మరణం.. మరో పక్క ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతితో ఆ కుటుంబం పిల్లల్ని కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోయింది. దీన్ని చూసిన స్థానికుల కంట కన్నీరు ఆగలేదు.