డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వికలాంగులకు 5 శాతం కేటాయించాలని టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం దేశానికే ఆదర్శమని వికలాంగుల నెట్ వర్క్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాసులు ప్రశంసించారు. డబుల్ బెడ్రూంలో 5శాతం కోటా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వికలాంగులు సంతోషపడుతున్నారని ఆయన తెలిపారు.
వికలాంగులకు 5 శాతం కోటా ఇవ్వాలని ఆలోచన చేసిన సీఎం కేసీఆర్, కృషి చేసిన నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఎంపీ కవితను ఎం. శ్రీనివాసులుతో పాటు జాగృతి వికలాంగుల విభాగం కన్వేనర్ అంజనారెడ్డి కూడా కలిశారు.