కుఠిల రాజకీయాలు చేయంలో ఆరి తేరిన చంద్రబాబు.. 2014 ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి.. అధికారం చేపట్టిన చంద్రబాబు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూడా తన అస్ర్తాలను వదులుతున్నారు. కానీ అవి కాస్తీ తిరిగి చంద్రబాబు సర్కార్‌కే ఎసరు పెడుతుండటం విశేషం. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట ఇది.
ఇక అసలు విషయానికొస్తే.. ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుధీర్ఘంగా ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పాదయాత్రలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే జగన్ పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకోవడంతోపాటు.. 700 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. అయితే, జగన్ పాదయాత్ర లక్ష్యం మూడు వేల కిలోమీటర్లు కాగా.. ఇందుకు మరో ఏడు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రజా సంకల్ప యాత్రతో జగన్‌పై పెరుగుతున్న ప్రజాదారణను చూసి ఓర్వలేని చంద్రబాబు సర్కార్ ఇటీవల జన్మభూమి – మా ఊరు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కేవలం పది రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ రూ.20 కోట్లును కేటాయించింది.
ఇదంతా ఇప్పుడే ఎందుకు అంటే.. జగన్ ప్రజా సంకల్ప యాత్ర నుంచి జన్మభూమి వైపు ప్రజల దృష్టిని మరల్చేందుకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, ఇలా చంద్రబాబు జగన్‌పై సంధించిన జన్మభూమి అస్ర్తం తిరిగి.. తిరిగి చంద్రబాబుకే తగిలిందంటున్నారు ప్రజలు. దీనికి కారణం కూడా లేకపోలేదు. జన్మభూమి మా ఊరిలో అధికార పార్టీ నేతలను, మంత్రులను, అధికారులను ప్రజల నిలదీతలు ఎక్కువయ్యాయి. ఎన్నికల సమయంలో అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలను చూసి ఓట్లు వేశామని, అధికారం చేపట్టాక అవేవి నెరవేర్చలేదంటూ చంద్రబాబు సర్కార్‌పై పెదవి విరుస్తున్నారు ప్రజలు. వీడియోలు కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు జన్మభూమి అంటూ సంధించిన అస్ర్తం జగన్‌కు కాక.. చంద్రబాబు సర్కార్‌కు తగిలిందన్నది జగమెరిగిన సత్యం.